అన్నదాతలకు షాక్: ఎల్నినో ప్రభావంతో గణనీయంగా తగ్గిన వరి ధాన్యం దిగుబడులు

రిపోర్టర్: మహేష్ స్థలం: సంగం

సంగం జిల్లాలో ఎడగారు పంటపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా చూపడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారిణి సత్యవాణి వెల్లడించారు. ఎండల తీవ్రత పెరగడంతో వరి కంకుల్లో నాణ్యత తగ్గి ధాన్యంలో తాలు అధికమైందని ఆమె తెలిపారు. గతేడాదితో పోలిస్తే సాగు వ్యయం రూ.41 వేలకు పెరిగినప్పటికీ, దిగుబడులు తగ్గిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.