తిమ్మరాజుపేటలో వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే విజయ్కుమార్

రిపోర్టర్: I am Farmer 🍅🌱 స్థలం: అచ్యుతాపురం

అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటకు చెందిన టీడీపీ ఇన్చార్జి దాడి వెంకటేష్ కుటుంబాన్ని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ సోమవారం పరామర్శించారు. వెంకటేష్ తల్లిదండ్రులను కలిసి ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

చిన్న వయసులోనే వెంకటేష్ మృతి చెందడం పార్టీకి, గ్రామానికి తీరని లోటని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.