ఓటీటీలోకి ఆనంద్ దేవరకొండ మూవీ: నెట్ఫ్లిక్స్లో ఎపిక్ స్ట్రీమింగ్ తేదీ ఖరారు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

యంగ్ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి రానుందని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. వినోదప్రియులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.