తీరానికి తీవ్ర తుపాను ముప్పు: విజయనగరం జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

అర్నబ్ తుపాను ముప్పు నేపథ్యంలో విజయనగరం జిల్లాలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అధికారులతో సోమవారం నిర్వహించిన అత్యవసర సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.