ఆళ్లగడ్డలో చరిత్ర సృష్టి: మున్సిపాలిటీ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో తెదేపా హవా

రిపోర్టర్: సురేష్ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పురపాలిక ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సహాయ అధికారి పి.కిషోర్ ప్రకటించారు. ఛైర్ పర్సన్గా తెదేపాకు చెందిన షేక్ అనీషా ఎన్నికయ్యారు. ముప్పై రెండు వార్డుల్లో తెదేపా ఇరవై రెండు, వైకాపా ఎనిమిది, జనసేన రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. పురపాలిక చరిత్రలో ఎన్నిక ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారమని అధికారులు వెల్లడించారు.