విషపూరిత మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసిన జగన్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Amaravati
విషపూరిత మద్యం తయారు చేసి జగన్ ప్రజల ప్రాణాలు తీశారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత పాలనలో జరిగిన అక్రమాలను తీవ్రంగా ఎండగట్టారు. ప్రజాధనాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ విధమైన విధానాలపై కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.