మున్సిపల్ ఎన్నికల ఆరోపణలపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: నెల్లూరు
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై వైకాపా నేతలు చేస్తున్నవి అర్థం లేని ఆరోపణలని పురపాలకశాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ వార్డుల విభజన, రిజర్వేషన్లు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా చట్టప్రకారం, పారదర్శకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఓటమి భయంతోనే ఆ పార్టీ నేతలు నిరాధార విమర్శలు చేస్తున్నారని, ప్రశాంత వాతావరణంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మంచి చేసే వారికి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.