అమ్మవారిపాలెం పాఠశాలలో పర్యావరణ రక్షణ కోసం మొక్కలు నాటిన ఎస్బీఐ మేనేజర్
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని అమ్మవారిపాలెం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్ డి. నరసింహులు, హెచ్ఎం షేక్ నౌరాజ్ తదితరులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.