పరిషత్ ఎన్నికల్ లో భారీ బందోబస్తు: ఆరువేల కేంద్రాల్ లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
మండల మరియు జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం నలభై వేలకు పైగా పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ రాజకుమారి వెల్లడించారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, రిగ్గింగ్‌ను అరికట్టేందుకు ఆరు వేల పోలింగ్ కేంద్రాల్ లో వెబ్‌కాస్టింగ్ తో పాటు ఆరు వేలకు పైగా కేంద్రాల్ లో వీడియోగ్రఫీ నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఐజీ తెలిపారు.