భార్యను నీడలా వెంట తీసుకెళ్లడం సాధ్యం కాదు: మద్రాస్ హైకోర్టు
రిపోర్టర్: రమేష్
స్థలం: తమిళనాడు
భర్త వెళ్లే ప్రతి చోటుకి భార్యను హచ్ డాగ్ మాదిరిగా వెంట తీసుకెళ్లడం ఆచరణ సాధ్యం కాదని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం స్పష్టం చేసింది. 16 ఏళ్లుగా విడిపోయి ఉంటున్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ, భార్యకు రూ.7 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. వివాహేతర సంబంధం ఆరోపణలను కొట్టివేస్తూనే, వారి వివాహబంధం పూర్తిగా తెగిపోయిందని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.