భారత్-చైనా సంబంధాలపై జీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. సరిహద్దు సమస్యలు, వాణిజ్యంపై చర్చించారు. ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకోవచ్చని జిన్‌పింగ్ తెలిపారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్, చైనా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.