'కోవూరు పర్యటనకు సర్వం సిద్ధం': మంత్రి నారా లోకేష్ టూర్ ఏర్పాట్లు పూర్తి
రిపోర్టర్: రాము
స్థలం: Kovur
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కోవూరు నియోజకవర్గ పర్యటనకు సర్వం సిద్ధమైనట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో లోకేష్ పర్యటన నేపథ్యంలో స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.