మీర్ పేట్ మంత్రాల చెరువు దుస్థితిపై వాకర్స్ తీవ్ర ఆందోళన

రిపోర్టర్: రాజేష్ స్థలం: మీర్ పేట్

రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పరిధిలోని మంత్రాల చెరువు దుస్థితి మరీ దారుణంగా తయారైందని వాకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించి వాకింగ్ ట్రాక్ పై వేయడంతో విపరీతమైన దుర్వాసన వెదజల్లుతోందని, మురుగునీరు వచ్చి చేరుతోందని వాపోయారు. అలాగే ఓపెన్ జిమ్ పరికరాలు దెబ్బతినడం, గంజాయి బ్యాచ్ ల బెడద పెరగడంతో వాకర్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.