శర్వానంద్ చిత్రంలో కథానాయికగా అవకాశం దక్కించుకున్న మానస వారణాసి
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
దేవకి నందన వాసుదేవ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హైదరాబాద్ సొగసరి మానస వారణాసి తాజాగా మరో భారీ క్రేజీ ఆఫర్ను సొంతం చేసుకున్నారు. టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ జార్జ్ క్రిష్ చిత్రంలో ఆమెను కథానాయికగా ఖరారు చేసినట్లు మేకర్స్ తెలిపారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.