'నకిలీ విత్తనాల కట్టడిలో సీడ్స్ కార్పొరేషన్ విఫలం': ఎమ్మెల్యే వంశీకృష్ణ
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీలో నకిలీ విత్తనాల అంశాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తీవ్రంగా ప్రస్తావించారు. మార్కెట్లోకి వస్తున్న నకిలీ విత్తనాలను అరికట్టడంలో సీడ్స్ కార్పొరేషన్ పూర్తిగా విఫలమైందని ఆయన అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆరోపించారు. కూరగాయల సాగును సబ్సిడీ ద్వారా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎకరాకు రూ. 46,250 వరకు ప్రోత్సాహకం అందిస్తున్నట్లు సభలో ప్రకటించారు.