స్థానిక ఎన్నికలకు మార్గం సుగమం: వరుసగా జరగనున్న పురపాలక పంచాయతీ జడ్పీ ఎన్నికలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, వైకాపా పిటిషన్లను కొట్టేయడంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనివార్యమైందని నెల్లూరు జిల్లా అధికారులు తెలిపారు. పురపాలక సంఘాలు, పంచాయతీలు అలాగే పరిషత్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ కసరత్తు వేగవంతం చేసిందని, జిల్లాలో ఎన్నికల సందడి మొదలైందని అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.