మదనపల్లెకు హంద్రీనీవా ద్వారా చేరుకున్న కృష్ణా జలాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: మదనపల్లె
కృష్ణా జలాలు శివారు ప్రాంతమైన మదనపల్లెకు చేరుకోవడంతో స్థానిక ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హంద్రీనీవా కాలువల ద్వారా తమ ప్రాంతానికి నీరు రావడంతో ప్రజలు కేరింతలు కొట్టారు. ఈ పరిణామంతో ఈ ప్రాంతంలోని సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.