గడువు దాటిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నా స్పందించని అధికారులు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
అమరావతి పరిసర ప్రాంతాల్లో గడువు దాటిన ఆహార పదార్థాలు, చాక్లెట్లు మరియు స్నాక్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సింగ్‌నగర్, గొల్లపూడి మరియు తాడిగడప ప్రాంతాలలో నాణ్యత లేని, గడువు ముగిసిన వస్తువులను అమ్ముతున్నప్పటికీ, బాధితులు ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.