పూణే మెట్రో పింక్ లైన్ ప్రారంభం: రూ. 21,800 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం
రిపోర్టర్: మహేష్
స్థలం: పూణే
మహారాష్ట్రలోని పూణే నగరంలో రూ. 21,800 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి శంకుస్థాపన చేశారని అధికారులు తెలిపారు. రూ. 8,300 కోట్లతో నిర్మించిన పింక్ లైన్ మెట్రోను ఆయన జాతికి అంకితం చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా పాల్గొన్నారని అధికారులు పేర్కొన్నారు.