విజయనగరం ఉత్సవాలు: ఘనంగా పైడితల్లి అమ్మవారి సిరిమాను ఇరుసుమాను వృక్షాల పూజా కార్యక్రమం
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
విజయనగరం మండలం జొన్నవలసలో పైడితల్లి అమ్మవారి సిరిమాను ఇరుసుమాను వృక్షాలు హుకుంపేటకు తరలించే కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. సిరిమాను చెట్టును గొడ్డలితో తాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన కోరారు.