మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం: ఓమన్ నుండి సౌరభ్ చంద్రకర్ అరెస్ట్
రిపోర్టర్: సునీల్
స్థలం: Raipur
మహాదేవ్ ఆన్ లైన్ బుక్ యాప్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్ ను సీబీఐ అధికారులు ఒమన్ నుండి భారత్ కు రప్పించారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇంటర్నెట్ ద్వారా భారీ ఎత్తున బెట్టింగ్ సిండికేట్ నడిపిన ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. రాయ్ పూర్ లోని ప్రత్యేక కోర్టులో సోమవారం ఆయనను హాజరుపరచనున్నారు. విదేశాల నుండి అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.