మోత్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన: నిలిచిన రిజిస్ట్రేషన్లతో తీవ్ర ఇబ్బందులు

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు దిగారు. రెండు శాఖల అధికారుల పరస్పర విరుద్ధ వైఖరి వల్ల సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.