గూడూరులో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ బింగి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: బీబీనగర్

బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో మంచినీటి సరఫరా మోటార్కు ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. హైవే కింద నుంచి వచ్చే కేబుల్ దెబ్బతినడంతో తాగునీటి అందించడం కష్టంగా మారింది. దీంతో స్పందించిన సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్ చొరవ తీసుకుని, చెరువు కట్టపై మూడు కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కేబుల్ బిగించారు. అలాగే మైసమ్మ ఆలయం వద్ద మరో స్తంభం వేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.