వృద్ధుల కోసం సరికొత్త ఉద్యోగాలు: చైనాలో పెరుగుతున్న తాత్కాలిక పిల్లల సంస్కృతి

రిపోర్టర్: నరేష్ స్థలం: బీజింగ్

చైనాలో వృద్ధుల ఒంటరితనాన్ని దూరం చేసేందుకు తాత్కాలిక పిల్లల సంస్కృతి వేగంగా విస్తరిస్తోందని విశ్లేషకులు తెలిపారు. వృద్ధాప్యంలో తోడుగా నిలిచేందుకు యువత వేతనం తీసుకుంటూ సేవలు అందిస్తున్నారని, దీనివల్ల వృద్ధులకు ఎంతో ఊరట లభిస్తోందని పేర్కొన్నారు. కుటుంబాలు దూరంగా ఉండటం, వలసల కారణంగా ఈ కొత్త companionship economy ఏడు బిలియన్ డాలర్లకు పైగా వ్యాపారంగా మారిందని నిపుణులు వెల్లడించారు.