ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: మహేష్ కుమార్ గౌడ్

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

ఆర్టీసీ యూనియన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ బలపరిచిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం జరిగిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాణం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.