రాజస్థాన్‌లో పంజాబ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Jaipur, Rajasthan
రాజస్థాన్‌లో పంజాబ్‌కు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులు ఇద్దరిపై చెరో రూ.5 లక్షల రివార్డు ఉందని ఏటీఎస్, ఏజీటీఎఫ్ హెడ్ దినేష్ ఎంఎన్ వెల్లడించారు. ఈ హైప్రొఫైల్ అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు.