బెంగళూరులో దారుణం: ట్రిపుల్ మర్డర్కు ముందు ఏఐ వేదికగా కిరాతకుడి సెర్చ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Bengaluru

బెంగళూరులోని కేఆర్ పురంలో జరిగిన ముగ్గురి హత్యల కేసులో నిందితుడు జె కెన్నెత్ దారుణమైన ప్రణాళిక రచించినట్లు పోలీసులు గుర్తించారని అధికారులు తెలిపారు. హత్యకు ముందు కృత్రిమ మేధను ఆశ్రయించి మనుషులను ఎలా దాడి చేయాలో, కత్తితో పొడవడంలో మెలకువలను, కారంతో కళ్ళల్లో కొట్టే విధానాలను వెతికాడని పోలీసులు స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి కారణంగానే అతడు ఈ కిరాతకానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.