కిటెక్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టాలంటూ మంత్రి లోకేశ్ విజ్ఞప్తి
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్ గార్మెంట్స్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కోరారు. కొచ్చిలోని ఆ సంస్థ కర్మాగారాన్ని సందర్శించి వస్త్ర తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం సీఎండీ సబు ఎం.జాకబ్‌తో భేటీ అయ్యారు. టెక్స్టైల్స్ రంగంలో ఏపీలో అపార అవకాశాలున్నాయని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పారిశ్రామికాభివృద్ధిపై పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.