తాండవ నది దాటేందుకు రైతుల సాహస యాత్ర: ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పాయకరావుపేట
పాయకరావుపేట మండలం మాసాహెబ్పేట గ్రామంలో రైతులు వ్యవసాయం కోసం తాండవ నదిని దాటేందుకు నిత్యం ప్రాణాలకు తెగించి సాహస యాత్ర చేస్తున్నారని మాసాహెబ్పేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న సిమెంటు స్తంభాల తాత్కాలిక వంతెన వరదలకు కొట్టుకుపోవడంతో, నడుము లోతు నీటిలో నశిస్తూ తమలపాకుల బుట్టలతో నది దాటుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నదిపై శాశ్వత వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.