కళాశాలలో డ్రెస్ కోడ్ వివాదం, విద్యార్థుల ఆందోళన
రిపోర్టర్: సురేష్
స్థలం: Karnataka
బెంగళూరులోని ఇండియన్ అకాడమీ డిగ్రీ కళాశాలలో డ్రెస్ కోడ్ మరియు గడ్డం పెంచడంపై వివాదం చెలరేగింది. యూనిఫాం ధరించలేదనే కారణంతో విద్యార్థులను కళాశాల వెలుపలికి పంపించడంతో వారు రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. అయితే నిబంధనల ఉల్లంఘన వల్లే చర్యలు తీసుకున్నామని కళాశాల యాజమాన్యం స్పష్టం చేయగా, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.