పెద్దపల్లి కలెక్టర్ ఆదేశం: రెసిడెన్షియల్ పాఠశాలల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత

రిపోర్టర్: విజయ్ స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పారిశుద్ధ్యం మరియు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఎలుకలు, పాము కాట్లు, ఆహార కలుషిత ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా కఠినమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం కోసం అన్ని పాఠశాలల్లోనూ నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆయన పేర్కొంటూ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.