మాటిస్తే నెరవేరుస్తాం: మాజీ మంత్రి కొండా సురేఖ

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

మాటిస్తే ఎంతటి కష్టాన్నయినా ఎదుర్కొంటామని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ మేరకు భర్త కొండా మురళితో కలిసి ఉన్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. కొండా మురళి మాటిస్తే తల తాకట్టు పెట్టయినా నెరవేరుస్తారని, ఆస్తి అమ్మి అయినా మాట నిలబెట్టుకుంటారని ఆమె తేల్చిచెప్పారు. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.