జన్నారంలో భారీ వర్షం మధ్యే గణేష్ నిమజ్జనాలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

జన్నారం పట్టణంలో గణేష్ నిమజ్జనాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. అకస్మాత్తుగా భారీ వర్షం రావడంతో నిమజ్జనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లోనే నిమజ్జనం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదంటూ అధికారులపై భక్తులు తీవ్రంగా మండిపడ్డారు.