త్వరలో స్ట్రైట్ తెలుగు సినిమా చేయనున్న హీరో కార్తీ!

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో జరిగిన 'సర్దార్ 2' ప్రమోషన్స్‌లో హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులపై తన అభిమానాన్ని చాటుకున్నారు. తమిళనాట మంచి కంటెంట్ ఉన్న ఏ భాషా చిత్రాలనైనా కోలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని స్పష్టం చేశారు. త్వరలో దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో కలిసి ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 10న 'సర్దార్ 2' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.