జిల్లా విద్యాధికారిని కలిసి సమస్యలు విన్నవించిన బి స్మార్ట్ కమిటీ
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారిని బి స్మార్ట్ జిల్లా కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై చర్చించారు. బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులు కొండూరి మల్లేశం గౌడ్, కోశాధికారి సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తీగల జయలక్ష్మి, కార్యదర్శి ఆబోతుల కీర్తి డీఈఓను సత్కరించి సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు.