ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ముగ్గురు పసికందులు మృతి

రిపోర్టర్: హరి స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చిన్నపిల్లల అత్యవసర వైద్యవిభాగంలో చికిత్స పొందుతున్న ముగ్గురు పసికందులు మంటలు మరియు దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించగా, నర్సులు మరియు తల్లులు అప్రమత్తమై సుమారు 28 మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.