'శాంతిభద్రతలు కాపాడాలి': కొండాపూర్లో సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ
రిపోర్టర్: ASIF reporter
స్థలం: నిజామాబాద్ రూరల్
కొండాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటనపై నిజామాబాద్ ఏసీపీ శ్రీ బి. ప్రకాష్ గారు ఈరోజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలు కఠినంగా కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.