భక్తిశ్రద్ధలతో వినాయక మండపంలో పూజలు చేసిన ప్రజాప్రతినిధులు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్టించిన గణనాథుడిని మున్సిపల్ చైర్ పర్సన్ దావా స్వాతి రమేష్ బాబు, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం దర్శించుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ గణనాథుని ఆశీస్సులతో బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. నాయకులు పోలు ఉమాదేవి శ్రీనివాస్, డికొంద పద్మ రాజలింగు, చింతల వసంత, పూలమ్మ నీలి హారిక కృష్ణ గాలి సుమలత శ్రీనివాస్ కొక్కుల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.