తిరుమల తిరుపతి దేవస్థానం: టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీ నియామకం
రిపోర్టర్: రాము
స్థలం: తిరుపతి
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులతో స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర చైర్మన్గా వ్యవహరించనుండగా, ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్, దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఈ అథారిటీ పదవీకాలం ఏడాది పాటు ఉంటుందని లేదా కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.