గ్రామ సమస్యలను పరిష్కరించాలంటూ ఇంచార్జ్ కలెక్టర్ను కోరిన సర్పంచ్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన సర్పంచ్ కర్ర వెంకటేశం సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావుకు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మరియు పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.