పాక్ బోర్డు చీఫ్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని ముందే చెప్పాం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
మహిళల ఆసియా కప్ 2026 విజేతగా నిలిచినా ట్రోఫీ ప్రదానోత్సవానికి భారత జట్టు దూరంగా ఉండటంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టతనిచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, శత్రు దేశానికి చెందిన మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోబోమని ఏసీసీకి ముందే స్పష్టం చేశామని తెలిపారు. సంప్రదాయాలు మార్చడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే రెండు ట్రోఫీలు భారత్ కు వస్తాయని భరోసా ఇచ్చారు.