'సభ శుక్రవారానికి వాయిదా': తెలంగాణ శాసనసభ సమావేశాలపై స్పీకర్ ప్రకటన

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. సమావేశాలు పునఃప్రారంమైన తర్వాత ఎల్‌నినో ప్రభావంపై లఘు చర్చ జరగనుండగా, సభను శనివారం వరకు పొడిగించే అవకాశముంది. సభా నిర్వహణపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీజేపీ, ఎంఐఎం నేతలతో భేటీ అయి సజావుగా సాగేలా చర్చలు జరిపారు.