ఢిల్లీలో స్వల్పంగా దిగజారిన గాలి నాణ్యత స్థాయి

రిపోర్టర్: రాము స్థలం: ఢిల్లీ

ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ మంగళవారం మధ్యస్త స్థాయికి పడిపోయినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం కొనసాగుతుండటంతో నగరంలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోందని ఐసీఏఆర్ తెలిపింది. ఈ వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో గాలి నాణ్యత ఆందోళనకరంగా మారుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.