తౌషిక్ మృతి కేసులో వీడని నీలినీడలు, తల్లి ఆత్మహత్యతో కలకలం
రిపోర్టర్: హరి
స్థలం: ప్రకాశం
ఒంగోలు జిల్లా సింగరాయకొండలో అనుమతులు లేని నవోదయ కోచింగ్ సెంటర్ హాస్టల్లో విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసు తీవ్ర కలకలం రేపింది. బిడ్డ మృతికి న్యాయం జరగాలంటూ హైకోర్టు వరకు పోరాడిన తల్లి మౌలాబీ ఆత్మహత్య చేసుకోవడంతో వ్యవస్థాగత లోపాలు, పోలీసుల నిర్లక్ష్యం బట్టబయలయ్యాయి. అప్పట్లో త్రిసభ్య కమిటీ విచారణలో అనేక నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి.