బ్యాంకు రుణాల మోసం కేసులో ఐదుగురికి మూడేళ్ల జైలు శిక్ష

రిపోర్టర్: కిరణ్ స్థలం: Lucknow

సిండికేట్ బ్యాంకుకు సంబంధించిన భారీ రుణాల మోసం కేసులో ఐదుగురు దోషులకు ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు దోషుల్ లో ప్రతి ఒక్కరికీ యాభై వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. నకిలీ పత్రాలతో రుణాలు పొంది మనీలాండరింగ్ కు పాల్పడినట్లు తేలడంతో విఎ మాథుర్ తో పాటు రాజీవ్ కుమార్, అరవింద్ చౌదరి, అంకిత్ చౌదరి, ప్రమోద్ కుమార్ లకు ఈ శిక్ష ఖరారైంది.