మంచిర్యాలలో దారుణం.. భార్య ముక్కు కొరిકેసిన భర్త

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాపురానికి రావడం లేదనే కోపంతో భార్య మమతపై భర్త మణిచందర్ దాడికి దిగాడు. మామను కొట్టి, భార్య ముక్కును బలంగా కొరకడంతో సగభాగం కట్ అయింది. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.