రూ.2,000 పైచిలుకు యూపీఐ లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి మర్చంట్ ఛార్జీలు!
రిపోర్టర్: హరి
స్థలం: India
రూ.2,000 మించిన యూపీఐ చెల్లింపులపై అక్టోబర్ 15 నుంచి మర్చంట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌పీసీఐ ప్రకటించింది. వ్యక్తిగత లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇతర మర్చంట్ చెల్లింపులపై 0.4 శాతం లేదా నిర్దిష్ట రంగాలకు రూ.5 ఫ్లాట్ ఫీజు వర్తిస్తుంది. రూ.2,000 లోపు లావాదేవీలకు మినహాయింపు కొనసాగుతుంది.