స్థానిక ఎన్నికల్ లో మరింత ఘనవిజయం సాధించాలి: కూటమి శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

మంచి చేస్తే ప్రజలు వెన్నంటే ఉంటారనడానికి పురపాలక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు మించి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని, పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.