భారీ రికార్డులున్నప్పటికీ జైస్వాల్ను వన్డే జట్టు నుంచి తప్పించడంపై మాజీల విస్మయం

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

అద్భుతమైన గణాంకాలు ఉన్నప్పటికీ యశస్వి జైస్వాల్ను న్యూజిలాండ్ పర్యటన వన్డే జట్టు నుంచి సెలెక్టర్లు తప్పించడం తీవ్ర విస్మయం కలిగించిందని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు. కేవలం ఆరు వన్డేల్లోనే రెండు సెంచరీలు బాదిన ఈ యువ ఓపెనర్కు వైట్ బాల్ జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిమిత ఓవర్లలో స్థానం కోసం జైస్వాల్ వికెట్ కీపింగ్ సాధన చేస్తుండగా, ఇలాంటి ప్రయోగాల జోలికి వెళ్లవద్దని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సూచించారు.