రైతన్నలకు తీపి కబురు: దుగ్గిరాల యార్డులో రికార్డు స్థాయిలో పసుపు ధర

రిపోర్టర్: రమేష్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ దుగ్గిరాల యార్డులో పసుపు ధర సరికొత్త చరిత్ర సృష్టించిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం జరిగిన ట్రేడింగ్లో క్వింటా పసుపు గరిష్ఠంగా పద్దెనిమిది వేల నాలుగు వందల రూపాయలు పలికిందని అధికారులు తెలిపారు. అన్సీజన్ కారణంగా నిల్వ ఉన్న సరుకుకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ధర భారీగా పెరిగినట్లు రైతులు ఆనందం వ్యక్తం చేశారు.